Advertisementt

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లేటుకు కారణం..!

Wed 16th Sep 2015 03:55 AM
sardhar gabbarsingh,pawan kalyan,bobby,jayanan vincent  సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లేటుకు కారణం..!
సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లేటుకు కారణం..!
Advertisement
Ads by CJ

ఏ ముహూర్తాన పవన్‌కళ్యాణ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రారంభించారో కానీ ఈ సినిమాకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదటగా దర్శకుడు సంపత్‌నందిని తీసేసి ఆ స్థానంలో బాబిని దర్శకునిగా తీసుకున్నారు. హీరోయిన్‌గా అనీషా ఆంబ్రోస్‌తో కొన్ని సీన్లు తీసి ఆమె స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ని తీసుకొని ఆ సీన్స్‌ను రీషూట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జయనన్‌ విన్సెంట్‌ ఈ ప్రాజెక్ట్‌ నుండి బయటకు వచ్చాడని సమాచారం. దర్శకుడు బాబికి, కెమెరామెన్‌ జయనన్‌ విన్సెంట్‌కు ఇగో క్లాషెస్‌తో పాటు క్రియేటివ్‌ డిఫరెన్స్‌లు చోటు చేసుకున్నాయని, దీంతో జయనన్‌ విన్సెంట్‌ బయటకు వచ్చాడని తెలుస్తోంది. బాబి తనకు నచ్చిన కెమెరామేన్‌ ఆర్దర్‌ ఎ. విల్స్‌ని తీసుకువచ్చి షూటింగ్‌ జరుపుతున్నట్లు సమాచారం. జయనన్‌ వైదొలగడం పట్ల పవన్‌ కూడా బాబిపై గుర్రుగా ఉన్నాడని అంటున్నారు. అందుకే షూటింగ్‌ నత్తనడకన సాగుతోందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ