Advertisementt

జగ్గూబాయ్‌ క్రేజ్‌ అంటే అది..!

Thu 17th Sep 2015 07:10 AM
jagapathibabu,legend,sreemanthudu,puli murugan  జగ్గూబాయ్‌ క్రేజ్‌ అంటే అది..!
జగ్గూబాయ్‌ క్రేజ్‌ అంటే అది..!
Advertisement
Ads by CJ

తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జగపతిబాబుకి మంచి అవకాశాలే వస్తున్నాయి. లెజెండ్‌, పిల్లా నువ్వులేని జీవితం, శ్రీమంతుడు వంటి చిత్రాలతో ఇప్పుడు జగ్గుబాయ్‌ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. తాజాగా ఆయనకు మలయాళం సినిమాలో ఓ కీ రోల్‌ వచ్చిందట. మోహన్‌లాల్‌ నటిస్తున్న పులిమురుగన్‌ అనే చిత్రంలో జగపతిబాబును పెట్టుకోవడానికి సిద్దమయిన ఈ చిత్రం యూనిట్‌ ఈ పాత్రకు గాను జగపతిబాబుకు ఏకంగా 50లక్షలు ఆఫర్‌ చేశారని సమాచారం. వాస్తవానికి ప్రస్తుతం టాలీవుడ్‌లో జగపతిబాబు కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. తెలుగు సినిమాల విషయానికి వస్తే అది పెద్ద మొత్తం కాదు. కానీ సినిమాలను తక్కువ బడ్జెట్‌లో తీసి, హీరోలతో సహా అందరికీ చాలా తక్కువ పారితోషికాలు ఇచ్చే మలయాళంలో జగ్గూబాయ్‌కి 50లక్షలు ఆఫర్‌ రావడం మలయాళ పరిశ్రమను ఆశ్యర్యానికి గురిచేస్తోంది. మొత్తానికి మలయాళంలో 50లక్షల ఆఫర్‌ పొందటం అంటే గ్రేట్‌ అనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ