ఇప్పుడు టాలీవుడ్ మొత్తం రకుల్‌ప్రీత్‌సింగ్ నామజపం చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లోని స్టార్ హీరోలైన రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్‌ల సరసన నటిస్తోంది. త్వరలో ఆమె మహేష్‌బాబుతో కూడా చేయనుంది. దాంతో ఈ అమ్మడు ఒక్కసారిగా తన పారితోషికాన్ని ఒకటిన్నర కోటికి పెంచేసిందట. దాంతో చిన్న సినిమా నిర్మాతలకు ఆమె రెమ్యూనరేషన్ భరించే స్థాయి లేకపోవడంతో ఇప్పుడు ప్రేమమ్ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ వారికి బెస్ట్ ఆప్షన్‌గా మారుతోంది. కాగా ఈ ప్రేమమ్ భామ త్రివిక్రమ్-నితిన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న అ..ఆ.. అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైంది. నాగచైతన్య సరసన ప్రేమమ్ తెలుగు రీమేక్‌లో కూడా ఆమె స్ధానం సంపాదించింది. తాజాగా ఆమె మీద దిల్‌రాజు దృష్టి పడింది. తాను వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేయనున్న ఎవడో ఒక్కడు అనే చిత్రంలో కూడా ఈ అమ్మడుకు అవకాశం వచ్చిందిట. సో.. రాబోయే రోజుల్లో రకుల్ మరీ ఓవర్ చేస్తే 20 నుండి 30లక్షలు మాత్రమే తీసుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ రకుల్‌కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.