డిఫరెంట్ చిత్రాలను అందరికి అర్ధమయ్యే విధంగా సూటిగా, స్పష్టంగా కమర్షియల్ హంగులు మిస్ కాకుండా చూపిస్తే మన ప్రేక్షకులు అలాంటి డిఫరెంట్ చిత్రాలను బాగా ఆదరిస్తారని ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంది. త్వరలో ఇలాంటి డిఫరెంట్ చిత్రాలు కొన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మెగాహీరో వరుణ్‌తేజ్, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న కంచె అందుకు ఓ ఉదాహరణ. రెండో ప్రపంచయుద్దం కాలం నాటి కథతో ఈ చిత్రం విభిన్నంగా రూపొందింది. ఈ చిత్రంతో పాటు అనుష్క లడ్డూబామగా కనిపిస్తున్న మరో చిత్రం సైజ్‌జీరో. ప్రకాష్‌కోవెలమూడి దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కూడా ఓ డిఫరెంట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాలో ఎక్కువభాగం వీల్‌చైర్‌కే పరిమితమయ్యే నాగార్జున, తమిళ స్టార్ కార్తిల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఊపిరి చిత్రాన్ని కూడా ఓ ప్రయోగంగానే చెప్పుకోవాలి. పివిపి సంస్ద నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. వీటితో పాటు ఎన్టీఆర్ హీరోగా విభిన్న చిత్రాల డైరెక్టర్‌గా పేరున్న సుకుమార్ దర్శకత్వంలో రూపొంందుతున్న నాన్నకు ప్రేమతో కూడా ఓ డిఫరెంట్ చిత్రంగానే రూపొందుతోందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ గెటప్ కూడా చాలా విభిన్నంగా ఉంది. అంతేకాక, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ డిఫరెంట్ చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచిచూడాల్సివుంది....!