రోజా, ముంబై వంటి పలు చిత్రాలలో నటించి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా అలరించిన అందగాడు అరవింద్‌స్వామి. కాగా ఆయన ఈమధ్య సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. అయితే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకోలేదు. కానీ ఇటీవల తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన తని ఒరువన్ చిత్రం తమిళనాట సంచలన విజయం సాధిస్తోంది. ఈ చిత్రంలో అరవింద్‌స్వామి పైకి మంచి వాడిగా కనిపించే విలన్‌గా అద్భుతంగా నటించాడనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు అన్ని భాషల దర్శకనిర్మాతలు, స్టార్‌హీరోలు తమ తమ భాషల్లో రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తమ రీమేక్స్‌లో ఒరిజినల్‌లో పోషించిన పాత్రనే అరవింద్‌స్వామి చేత చేయించాలని చాలా మంది ఆశలుపెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై స్వామి నీళ్లు చల్లాడు. ఒకే పాత్రను వివిధ భాషల్లో నటిస్తే బోర్‌గా అనిపిస్తుందని.. అందువల్ల ఈ చిత్రం రీమేక్స్‌లో తాను నటించే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు. అయితే తెలుగులో మాత్రం ఆయన ఈ పాత్రను చేయడానికి కాదనకపోవచ్చనే ఆశతో ఈ చిత్రం రీమేక్ చేయాలని భావిస్తున్నవారు ఉన్నారు. మంచి పారితోషికం ఇస్తామంటే ఆయన తప్పకుండా తెలుగులో అదే పాత్ర చేయడానికి ఒప్పుకొంటాడనే అంటున్నారు. మరి స్వామి తన మాట మీద ఎంతవరకు నిలబడతాడో వేచిచూడాల్సివుంది...!