Advertisementt

ఎన్టీఆర్‌ క్రేజ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు..!

Mon 21st Sep 2015 04:47 AM
ntr,shakthi movie,rajasthan,dil raju,hareesh shankar  ఎన్టీఆర్‌ క్రేజ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు..!
ఎన్టీఆర్‌ క్రేజ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు..!
Advertisement
Ads by CJ

జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలుగులో టాప్‌ స్టార్స్‌లో ఒకడు. ఆయన సినిమాలకు డిమాండ్‌ కేవలం తెలుగుతో పాటు కాస్తో కూస్తో సౌత్‌లో మాత్రమే ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... నార్త్‌లో కూడా ఎన్టీఆర్‌ సినిమాలకు ఆదరణ భారీగా ఉంటోంది.శక్తి షూటింగ్‌ కోసం ఆయన రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి నార్త్‌ స్టేట్స్‌కు వెళ్లినప్పుడు ఆయన్ను చూడటానికి ఎందరో నార్త్‌ ఇండియన్స్‌ వచ్చి వెళ్లారనేది తెలిసిన విషయమే. కాగా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తెలుగు సినిమాలు హిందీలోకి డబ్‌ అయి టీవీ చానెల్స్‌లో ప్రసారం అవుతున్నాయి. అందుకే ఆయనకు అక్కడ కూడా ఫ్యాన్‌ఫాలోయింగ్‌ పెరిగింది. ఎన్టీఆర్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన రామయ్యా వస్తావయ్యా చిత్రం తెలుగులో డిజాస్టర్‌గా మిగిలింది. బయ్యర్లతో పాటు దిల్‌రాజుకు కూడా భారీ నష్టాలను తెచ్చింది. దీంతో దిల్‌రాజు ఈ చిత్రం హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను, హిందీ శాటిలైట్‌ రైట్స్‌ను చాలా తక్కువ మొత్తానికి అమ్మేశాడు. ఈ చిత్రం మార్‌ మిటేంగే పేరుతో హిందీలో అనువాదమై ఇటీవల సోనీ సెట్‌ మ్యాక్స్‌లో ప్రసారం అయింది. కాగా విచిత్రంగా ఈ చిత్రానికి అద్బుతమైన టీఆర్పీ రేటింగ్స్‌ రావడంతో అందరూ ఖంగుతిన్నారు. గత వారాంతం నమోదైన టాప్‌ 5 టీఆర్పీ రేటింగ్స్‌ లిస్ట్‌లో ఈ చిత్రానికి రెండో స్థానం దక్కడం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ