Advertisementt

రూమర్లను ప్రచారం చేస్తోన్న దర్శకుడు..!

Tue 22nd Sep 2015 04:34 AM
sathyadeva,lion movie,balakrishna,sarvabhouma movie  రూమర్లను ప్రచారం చేస్తోన్న దర్శకుడు..!
రూమర్లను ప్రచారం చేస్తోన్న దర్శకుడు..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ హీరోగా రుద్రపాటి రమణారావు నిర్మాతగా నూతన దర్శకుడు సత్యదేవా డైరెక్ట్‌ చేసిన మూవీ లయన్‌. పవర్‌ఫుల్‌ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌ ఫలితాన్ని సాధించి నిర్మాతకు భారీ నష్టాలను కొనితెచ్చింది. అయితే దర్శకుడు సత్యదేవా మాత్రం ఈ చిత్రం ఓ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థకు విపరీతంగా నచ్చిందని, అజయ్‌ దేవగణ్‌ హీరోగా ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్‌ కానుందని, ఆ రీమేక్‌కు కూడా తానే దర్శకత్వం వహిస్తానని.. తనదైన పబ్లిసిటీ కోసం మీడియాను బాగా కవర్‌ చేశాడు. దాంతో అన్ని పత్రికలు, చానెల్స్‌లో ఈ వార్త హైలైట్‌గా ప్రచారం అయింది. అయితే ఇదంతా కేవలం తన తదుపరి చిత్రాల కోసం సత్యదేవా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్‌ అని టాలీవుడ్‌ మొత్తం కోడైకూస్తోంది. సత్యదేవాకు లయన్‌ చిత్రం అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో ఆ తర్వాత నుండి ఆయనకు మరే సినిమా చాన్స్‌లు రావడం లేదని, బాలకృష్ణ వంటి అద్బుతమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్‌ డేట్స్‌ ఇచ్చినప్పటికీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేక పోయిన సత్యదేవాకు ఎలాంటి చాన్స్‌లు, చివరకు చిన్న హీరోలతో కూడా అవకాశాలు రాకపోవడంతో ఆయన ఇలా ఫాల్స్‌ పబ్లిసిటీ చేస్తున్నాడని అంటున్నారు. అదేమంటే.. త్వరలో బాలయ్యతో సార్వభౌమ చిత్రం ఉంటుంది అని కూడా కనిపించిన అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ