ఆమధ్య ఎప్పుడో బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారుబుల్లోడు చిత్రాలు ఒకేరోజు విడుదలై సంచలనం సృష్టించాయి. ఇటీవల నాని నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఇందులో ఒకటి ఓకే అనిపించుకోగా, మరో చిత్రం మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా అలాంటిదే తెలుగు సినీ పరిశ్రమ చూడబోతోంది. అనుష్క నటించిన రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఒకే రోజున విడుదల చేయడానికి రిలీజ్ డేట్ ఇచ్చేశారు. సైజ్‌జీరో, రుద్రమదేవి.. ఈ రెండు చిత్రాలు అక్టోబర్9న విడుదల చేయాలని నిర్ణయించి ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో అనుష్క ఇరుకునపడినట్లయింది. దాంతో ఆమె పివిపి సంస్థ అధినేతలను కలిసి సైజ్‌జీరో చిత్రం రిలీజ్ వాయిదా వేయాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే వారు మాత్రం ఒప్పుకోకుండా పట్టుదలగా ఉన్నారట. రుద్రమదేవి విడుదలైనా సరే సైజ్‌జీరో ను అక్టోబర్9న విడుదల చేయడం ఖాయమని అనుష్కకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.