Advertisementt

అల్లుడు శీనుకు మరో అవకాశం..!

Tue 29th Sep 2015 08:54 AM
bellamkonda sreenivas,alludu sreenu,bheemaneni sreenivas  అల్లుడు శీనుకు మరో అవకాశం..!
అల్లుడు శీనుకు మరో అవకాశం..!
Advertisement
Ads by CJ

అల్లుడు శీను చిత్రంతో హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం భీమనేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో హిట్‌ అయిన సుందరపాండ్యన్‌ కు రీమేక్‌. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈలోగా మరో సినిమాని ఓకే చేశాడు సాయి శ్రీనివాస్‌. గుండెజారి గల్లంతయిందే, ఓ లైలాకోసం వంటి చిత్రాలను తెరకెక్కించిన విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని స్వయంగా బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్నాడు. ఓ తమిళ హిట్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ