ఒకప్పుడు తెలుగు సినిమా హీరోలకు సినిమాల నుంచి వచ్చే ఆదాయం తప్ప కమర్షియల్ యాడ్స్ చెయ్యడం, వాటి ద్వారా కూడా డబ్బు సంపాదించడం అనేది చాలా తక్కువగా వుండేది. సినిమా ఇండస్ట్రీలో అన్నిరకాల మార్పులు జరుగుతున్న తరుణంలో కమర్షియల్ యాడ్స్‌పైన కూడా దృష్టి పెడుతున్నారు టాలీవుడ్ హీరోలు. ప్రస్తుతం అత్యధికంగా యాడ్స్ చేస్తూ నెంబర్ వన్ స్థానంలో మహేష్‌బాబు కొనసాగుతున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, అఖిల్, రవితేజ వంటి హీరోలు కూడా కొన్ని యాడ్స్‌లో నటించారు. ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా థమ్సప్ యాడ్‌లో కనిపించాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఒక యాడ్‌లో కనిపించబోతున్నాడు. వీళ్ళంతా కమర్షియల్ యాడ్స్ చెయ్యగా లేనిది నేనెందుకు చెయ్యకూడదనుకున్నాడో ఏమోగానీ ఇప్పుడు దగ్గుబాటి రానా కూడా ఆ లిస్ట్‌లో చేరబోతున్నాడన్నది వార్త. మైక్రోమ్యాక్స్ మొబైల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చెయ్యాల్సిందిగా ఆ కంపెనీ రానా ని సంప్రదించిందని, దానికి రానా కూడా అనుకూలంగా స్పందించాడని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రావాల్సి వుంది. మొత్తానికి ఇప్పుడు రానా కూడా కమర్షియల్ యాడ్స్ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడన్నమాట.