దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నయనతార హీరోయిన్‌గా దానయ్య నిర్మాతగా రాధ అనే చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్టోరీ తనదని ఓ ఔత్సాహిక రచయిత అండ్ డైరెక్టర్ ఫిల్మ్‌చాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ గొడవ ముదిరిపాకాన పడింది. దీంతో వివాదాలకు దూరంగా ఉంటే వెంకీ ఆ చిత్రం నుండి బయటకు తప్పుకోవడంతో సినిమా అటకెక్కింది. కాగా తాజాగా మారుతి దర్శకత్వం వహించిన భలే భలే మగాడివోయ్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో మరోసారి మారుతి-వెంకటేష్‌ల కాంబినేషన్‌లో ఓ ఫ్రెష్ స్టోరీతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ నిర్మించనున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.