Advertisementt

ఛార్మి అక్కడ మళ్ళీ మొదలెట్టింది.!

Sat 03rd Oct 2015 02:44 AM
heroine charmi,jyothilaxmi heroine charmi,charmi in tamil movie 10 endrathukulla,charmi in vikram new movie,10 endrathukulla producer murugadoss  ఛార్మి అక్కడ మళ్ళీ మొదలెట్టింది.!
ఛార్మి అక్కడ మళ్ళీ మొదలెట్టింది.!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌గా, స్పెషల్‌ సాంగ్స్‌లో తెలుగులో మెరిసిన ఛార్మి ఇప్పుడు మళ్ళీ తమిళ్‌ ఇండస్ట్రీవైపు వెళ్ళింది. ఆరేడు సంవత్సరాల క్రితం వరకు అడపా దడపా తమిళ్‌ సినిమాలు కూడా చేసిన ఛార్మి చాలా గ్యాప్‌ తర్వాత విక్రమ్‌ హీరోగా విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో మురుగదాస్‌ నిర్మిస్తున్న 10 ఎండ్రాత్తుకుల్లా చిత్రంలో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతోంది. ఈమధ్య జ్యోతిలక్ష్మీ సినిమాతో తెగ హడావిడి చేయడమే కాకుండా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభాసు పాలైన ఛార్మి ఇక టాలీవుడ్‌లో లాభం లేదనుకుందో ఏమో తమిళ్‌ ఇండస్ట్రీలో తేలింది. 10 ఎండ్రాత్తుకుల్లా తర్వాత తమిళ్‌లో బిజీ అయిపోతానన్న నమ్మకంతో వుందట. ఈ సినిమాలో ఛార్మి చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ వుందనేది తెలియలేదు. స్పెషల్‌ సాంగ్‌ చేసిందా? లేక స్పెషల్‌ క్యారెక్టర్‌ చేసిందా? అనే విషయం గురించి ఎక్కడా నోరు విప్పడంలేదు. జ్యోతిలక్ష్మీ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా రాకపోవడంతో కోలీవుడ్‌కి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ