Advertisementt

మరో కొత్త ప్రాజెక్ట్‌కి కళ్యాణ్‌రామ్‌ రెడీ.!

Mon 05th Oct 2015 03:09 AM
telugu hero kalyan ram,kalyan ram new project with director veeru potla,kalyan ram latest movie sher will release on 30th october,sher movie audio on 10th oct  మరో కొత్త ప్రాజెక్ట్‌కి కళ్యాణ్‌రామ్‌ రెడీ.!
మరో కొత్త ప్రాజెక్ట్‌కి కళ్యాణ్‌రామ్‌ రెడీ.!
Advertisement
Ads by CJ

2015 ప్రారంభంలోనే పటాస్‌తో సూపర్‌హిట్‌ కొట్టిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఇప్పుడు మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న షేర్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియో అక్టోబర్‌ 10న పార్క్‌ హయాత్‌ హోటల్‌లో ఎన్టీఆర్‌ ముఖ్యఅతిథిగా రిలీజ్‌ కానుంది. అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా వుంటే షేర్‌ ఇంకా రిలీజ్‌ అవ్వకముందే మరో కొత్త ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టబోతున్నాడు కళ్యాణ్‌రామ్‌. రైటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి బిందాస్‌ చిత్రంతో డైరెక్టర్‌గా టర్న్‌ అయి రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన వీరు పోట్ల తన లేటెస్ట్‌ మూవీ నందమూరి కళ్యాణ్‌రామ్‌తో చేయబోతున్నాడట. కళ్యాణ్‌రామ్‌ ఇమేజ్‌కి తగ్గ కథను రెడీ చేసాడట వీరు. కళ్యాణ్‌రామ్‌ కూడా వీరుతో సినిమా చేసేందుకు సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కళ్యాణ్‌రామ్‌కి కథ వినిపించేందుకు రెడీ అవుతున్నాడు వీరు. అయితే ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్‌ తన సొంత బేనర్‌లో నిర్మిస్తాడా? లేక బయటి బేనర్‌లో చేస్తాడా అనేది తెలియాల్సి వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ