సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వై.వి.ఎస్.చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో నిర్మాతగానూ మారి చాలా టైమ్ తీసుకొని ఆ సినిమాతో సూపర్‌హిట్ కొట్టాడు. తన ప్రతి సినిమానూ సంవత్సరాల తరబడి చెక్కే చౌదరి సినిమా డిజాస్టర్ అయినా చెదరని ఆత్మవిశ్వాసంతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తుంటాడు. మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన రేయ్ చిత్రం ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను దాటుకొని రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ ఫ్లాప్ అతన్ని ఏవిధంగానూ ప్రభావితం చేయలేకపోయింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకు దేవుడి సినిమాల టైటిల్స్ పెట్టని చౌదరి ఈ సినిమాకి మాత్రం కృష్ణా ముకుందా మురారి అనే టైటిల్‌ని బొమ్మరిల్లు బేనర్‌లో రిజిష్టర్ చేశాడు. ఈ సినిమాతో ఆ దేవుడి కటాక్షం తనపై వుంటుందని భావించాడో ఏమోగానీ ఇదే టైటిల్‌తో తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌ని చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు అనేది తెలియాల్సి వుంది.