Advertisementt

స అక్షరం సెంటిమెంట్‌..!

Mon 05th Oct 2015 12:11 PM
bhimaneni srinivasarao,allu arjun,sarainodu,speedunnodu  స అక్షరం సెంటిమెంట్‌..!
స అక్షరం సెంటిమెంట్‌..!
Advertisement
Ads by CJ

తాజాగా అల్లుఅర్జున్‌-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్‌ పతాకంపై ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సరైనోడు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే వాస్తవానికి తన సినిమాలకు స తో మొదలయ్యే పదాలను టైటిల్స్‌గా పెట్టే ఆచారం ఉన్న మరో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తాను తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తమిళ హిట్‌ మూవీ సుందరపాండ్యన్‌ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా భీమనేని సరైనోడు అనే టైటిల్‌ను పెట్టాలని భావించాడట. కానీ అప్పటికే అల్లుఅరవింద్‌ ఆ టైటిల్‌ను రిజిష్టర్‌ చేయించడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ చిత్రానికి స్పీడున్నోడు అనే టైటిల్‌ను పెట్టాలని భావిస్తున్నాడట. మొత్తానికి యస్‌ అక్షరంతో మన ముందుకు రానున్న భీమనేని ఈ చిత్రంతోనైనా సరైన హిట్‌ కొడతాడా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ