గోనా గన్నారెడ్డి గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఆయన వల్లే రుద్రమదేవి సినిమాకు కమర్షియల్ హంగులు వచ్చాయని అంటున్నారు సినీ విమర్శకులు. ఇక ఇటీవల రుద్రమదేవి కోసం అల్లు అర్జున్ పత్రికల వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాలను బోల్డ్‌గా చెప్పాడు. తక్కువ బడ్జెట్‌తో వచ్చే చిన్న సినిమాలను, వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే హీరోలను మీరు అభినందిస్తారా అని అడిగిన ప్రశ్నకు బన్నీ సమాధానమిస్తూ.. నాకు తెలిసి మన టాలీవుడ్‌లో అంత గొప్ప చిన్న సినిమాలు ఏమీ రావడం లేదు. మరి అవుట్‌ఆఫ్ బాక్స్‌లో సినిమాలు చేసే హీరోలు కూడా కనపడలేదు. ఈ కోవలో ఒక్క హీరో నిఖిల్ మాత్రమే వున్నాడు.. అని చెప్పుకొచ్చాడు.