Advertisementt

వాస్తవం చెప్పేస్తున్న కాజల్‌..!

Tue 13th Oct 2015 06:37 AM
kajal agarwal,top heroine,glamorous heroine,exposing  వాస్తవం చెప్పేస్తున్న కాజల్‌..!
వాస్తవం చెప్పేస్తున్న కాజల్‌..!
Advertisement
Ads by CJ

తెలుగు నాట కాస్త పద్దతిగానే కనిపిస్తూ.. గ్లామర్‌ బురదలో కూరుకుపోకుండా అందంగా కనిపిస్తూనే నటనపై కూడా పట్టువున్న హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. ఆమె అందంగా కనిపిస్తుందే కానీ ఎప్పుడు హద్దులు దాటలేదు. తన పరిధిలోనే ఉంటూ అందాల ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. అందుకే ఇంతకాలం ఈ ఫీల్డ్‌లో నిలబడగలిగింది. అసలు ఎక్స్‌పోజింగ్‌పై కాజల్‌ అభిప్రాయం ఏమిటి? తాను ఏమనుకుంటోంది? అనే విషయాలు ఆరా తీస్తే ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఎక్స్‌పోజింగ్‌ ఒక్కటే హీరోయిన్లను అందలం ఎక్కించదు. గ్లామర్‌తో పాటు నటనా కావాలి. గ్లామర్‌ అందరిలో ఉంటుంది. నటన కొద్ది మందికే సాధ్యం అవుతుంది. ఈ రెండింటిని సమపాళ్లలో మిక్స్‌ చేసే తెలివితేటలు కూడా కావాలి. అలా మెయిన్‌టెయిన్‌ చేసిన వారు మాత్రమే ఈ ఫీల్డ్‌లో నిలబడగలుగుతారు.... అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో కాజల్‌ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం అని ఒప్పుకోకతప్పదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ