శ్రీనువైట్ల సినిమా అంటే అందులో ఖచ్చితంగా ఓ తాగుడు సీన్ ఉంటుంది. హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చుని మందుకొట్టి ఎవరో ఒకరిని అక్కడ బకరాను చేసి కొట్టడం, తన కసి తీర్చుకోవడం ఈ సీన్స్ సారాంశం. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో చేస్తున్న బ్రూస్‌లీలో కూడా అలాంటి సీన్స్ ఉంటాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. బ్రూస్‌లీలో కూడా ఇలాంటి డ్రింకింగ్ సీన్ ఒకటి ఉందని, అయితే అది చాలా తక్కువ నిడివి కలిగిన సీన్ మాత్రమే అని, దానిలో మరీ ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించవద్దని శ్రీనువైట్ల అంటున్నాడు. మరి ఆ సీన్ ఎవరిపై ఉంటుందో? ఎంత సేపు ఉంటుందో వేచిచూడాల్సి ఉంది..!