లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ సోదరుడు చంద్రహాసన్ నిర్మిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. కమల్‌హాసన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజేష్.ఎమ్.సెల్వ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ చిత్రం స్లీప్‌లెస్ నైట్(2011) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా నిర్మిస్తున్నారని చెన్నై ఫిలిమ్ సర్కిల్స్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై దర్శకుడు రాజేష్ సమాధానం ఇస్తూ... తాను ఓ నవల రైట్స్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించానని, బయట జరుగుతున్న ప్రచారం తనకే ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నాడు. ఇది ఓ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. సంబంధిత నవలా రచయిత నుండి అధికారికంగా హక్కులు పొంది అధికారికంగా ఈ చిత్రాన్ని తీస్తున్నాను. మరో సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని వాదన నిజం కాదు... అని క్లారిటీ ఇచ్చాడు.