Advertisementt

బాహుబలి బడ్జెట్‌ అతని రెమ్యునరేషన్‌.!

Thu 15th Oct 2015 02:10 AM
shankar latest movie robo2,robo2 starts from december 12,rajnikanth birthday on dec 12,arnold shwarzeneger in robo2,arnold remuneration 100 crores  బాహుబలి బడ్జెట్‌ అతని రెమ్యునరేషన్‌.!
బాహుబలి బడ్జెట్‌ అతని రెమ్యునరేషన్‌.!
Advertisement
Ads by CJ

డైరెక్టర్‌ శంకర్‌కి ఒక స్పెషాలిటీ వుంది. తన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. ఆ ప్రత్యేకతను చూసేందుకే అభిమానులు శంకర్‌ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తుంటారు. జయాపజయాలు సర్వసాధారణం కాబట్టి అతని రీసెంట్‌ సినిమా ఐ అందర్నీ ఆకట్టుకోలేకపోయింది. ప్రాణం పెట్టి చేసిన విక్రమ్‌ అభాసుపాలయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా శంకర్‌ చేయబోతున్న ప్రాజెక్ట్‌ రోబో2. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పుట్టినరోజు డిసెంబర్‌ 12న ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈచిత్రంలో విలన్‌గా నటిస్తారని అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ పేర్లు గతంలో వినిపించాయి. ఇప్పుడు ఈ చిత్రంలో హాలీవుడ్‌ హీరో అర్నాల్డ్‌ ష్వార్జెనెగర్‌ విలన్‌గా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. రోబో2లో విలన్‌గా నటించడానికి అతను ఓకే చెప్పాడని, 25 రోజులు డేట్స్‌ కూడా కేటాయించాడని సమాచారం. ఇదిలా వుంటే ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు అర్నాల్డ్‌ 100 కోట్లు డిమాండ్‌ చేశాడని, ఆ మొత్తం ఇవ్వడానికి రోబో2 ప్రొడ్యూసర్స్‌ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తం ఇండియాలోని ఏ స్టార్‌ హీరోకీ ఇవ్వలేదని, విలన్‌ క్యారెక్టర్‌ కోసం అంత పెద్ద మొత్తం ఇవ్వడం ఏమిటి అనేవాళ్ళూ లేకపోలేదు. 

రజనీకాంత్‌కి ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా మంచి మార్కెట్‌ వుండడం వల్ల ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు శంకర్‌ డిసైడ్‌ అయ్యాడు. అందుకే ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌ వుండాలన్న ఉద్దేశంతో అర్నాల్డ్‌ని ఈ ప్రాజెక్ట్‌లోకి లాగాడు. బాహుబలిలాంటి భారీ బడ్జెట్‌ సినిమా రెమ్యునరేషన్‌ అర్నాల్డ్‌ ఒక్కడికే ఇచ్చి అతనితో రోబో2లో యాక్ట్‌ చేయిస్తున్నాడు. ఐ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఎమీ జాక్సన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వుందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ