Advertisementt

ధర్మామీటర్‌ పేలిపోతోంది..!

Fri 16th Oct 2015 08:49 AM
tamanna,glamour show in bengal tiger,bahubali,bahubali2  ధర్మామీటర్‌ పేలిపోతోంది..!
ధర్మామీటర్‌ పేలిపోతోంది..!
Advertisement
Ads by CJ

ఒకేఒక్క చిత్రం మిల్కీబ్యూటీ తమన్నాకు మంచి కెరీర్‌ ప్రసాదించింది. అదే బాహుబలి. ఇప్పటివరకు ఆమె స్టార్‌ హీరోల సరసన నటించిన చిత్రాల్లో రచ్చ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక నాగచైతన్య వంటి హీరోలతో మాత్రం హిట్స్‌ ఇచ్చింది. కాగా మొదటి నుండి గ్లామర్‌షోకు రెడీ అనేట్లు ఉన్న తమన్నా తన రాబోయే చిత్రం బెంగాల్‌టైగర్‌లో రవితేజతో కలిసి రెచ్చిపోయిందని సమాచారం. టీజర్‌లోనే ఆమె తనహాట్‌ హాట్‌ అందాలతో కుర్రకారు మతిని పోగొట్టే విధంగా ఉంటే ఇక సినిమా మొత్తం ఆమె ఎలా ఉండబోతోంది? అని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మరోసారి ఆమె నటించిన వాన పాటలో ఆమె అందాల ప్రదర్శన అదుర్స్‌ అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. మొత్తానికి తన అందాలను ఎరగా వేసి ఆమె సినిమాల మీద సినిమాలను పట్టేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె నాగార్జున-కార్తిల ఊపిరి చిత్రంతో పాటు బాహుబలి2 లో కూడా నటిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ