Advertisementt

నిఖిల్ సినిమా ట్రైలర్ అదిరింది..!

Sat 17th Oct 2015 07:02 AM
nikhil,sankarabharanam,sankarabharanam teaser,bruce lee interval  నిఖిల్ సినిమా ట్రైలర్ అదిరింది..!
నిఖిల్ సినిమా ట్రైలర్ అదిరింది..!
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న యువ కథానాయకుడు నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం శంకరాభరణం. కోనవెంకట్ సమర్పణలో గీతాంజలి నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. కాగా చిత్ర ట్రైలర్‌ను బ్రూస్‌లీ విడుదలైన  అన్ని థియేటర్లలో ఇంటర్వెల్‌లో ప్రదర్శిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన శంకరాభరణం విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరూ నిఖిల్ మరో హిట్ ఖాయమని అంటున్నారు. నిఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి కోనవెంకట్ కథ, మాటలు అందించాడు. కథానాయిక అంజలి ఈ చిత్రంలో మున్నీ అనే నెగెటివ్ రోల్‌లో కనిపించనుంది. నందిత నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ నందనవనం దర్శకుడు. సో.. నిఖిల్ ట్రైలర్ అదిరింది.. ఇక సినిమా ఎలా వుంటుందో చూద్దాం..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ