Advertisementt

రాజ్ తరుణ్‌కు అంత కావాలా?

Sat 17th Oct 2015 07:16 AM
raj tarun,kumar 21f,sitamma andalu ramayya sitralu,raj tarun remureration,raj tarun demand  రాజ్ తరుణ్‌కు అంత కావాలా?
రాజ్ తరుణ్‌కు అంత కావాలా?
Advertisement
Ads by CJ

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్తమామ చిత్రలు హిట్‌కావడంతో కుర్రహీరో రాజ్‌తరుణ్‌కు మంచి డిమాండ్ మొదలైంది. అంతేకాదు ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా... దేవిశ్రీప్రసాద్, రత్నవేలు లాంటి గొప్ప సాంకేతిక నిపుణులతో కలిసి రాజ్‌తరుణ్‌తో కుమారి 21ఎఫ్ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ యువ కథానాయకుడు గాలిలో తేలుతున్నాడు. ప్రస్తుతం కుమారి 21ఎఫ్‌తో పాటు సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు చిత్రాల్లో నటిస్తున్న రాజ్ తన పారితోషికాన్ని భారీగా పెంచాడట. ప్రస్తుతం రాజ్  అక్షరాల కోటి రూపాయాలు డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో వున్న రెండు చిత్రాలు విడుదల తర్వాతే మిగత సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటానని కండీషన్ కూడా పెడుతున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. రెండు సినిమాలకే రాజ్ ఇలా డిమాండ్ చేయడం నిర్మాతలకు రుచించడం లేదట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ