Advertisementt

టెన్షన్‌ పడుతోన్న పవన్‌ ఫ్యాన్స్‌..!

Tue 20th Oct 2015 02:58 AM
pawan kalyan,dasari narayanarao,paramaveerachakra,errabassu  టెన్షన్‌ పడుతోన్న పవన్‌ ఫ్యాన్స్‌..!
టెన్షన్‌ పడుతోన్న పవన్‌ ఫ్యాన్స్‌..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ది విభిన్నమైన మనస్తత్వం. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎలాంటి ఎత్తుగడ వేస్తాడో, ఎవరిని పిలిచి డైరెక్టర్‌ కుర్చీలో కూర్చోబెడుతాడో చెప్పలేం. ఆయన నిర్ణయాలన్నీ అప్పటికప్పుడు జరిగిపోతుంటాయి. మనసులో ఏమనుకుంటాడో అదే చేసెయ్యడం ఆయన అలవాటు. ఇప్పుడు ఆయన అందరినీ ఆశ్యర్యపరిచే షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడనేది టాలీవుడ్‌ టాక్‌. త్వరలో పవన్‌ దాసరి నిర్మాతగా ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. పవన్‌ కోసం గత కొన్ని రోజులుగా దాసరి కథలను తయారు చేస్తున్నాడు. అందులో ఓ కథ ఆల్‌మోస్ట్‌ ఓకే అయిపోయిందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడి కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల దాసరిని కలుసుకున్న పవన్‌.. గురువు గారూ.. ఈ సినిమాను మీరే డైరెక్ట్‌ చేసేయండి.. అన్నాడట. ఆ మాట విని దాసరి ఉత్సాహంగా పొంగిపోయాడట. అయితే ఈ వార్త పవన్‌ అభిమానులను మాత్రం కలవరపెడుతోంది. ఎందుకంటే దాసరి అనుభవజ్ఞుడైన దర్శకుడే కావచ్చు. ఇది వరకు ఆయన సంచలనాలను నమోదు చేసి ఉండవచ్చు. కానీ ఆయన నేటి ట్రెండ్‌కు తగిన దర్శకుడు కాదు అనేది అందరి భావన. దానికి తోడు ఆయన ఇటీవల తీసిన పరమ వీర చక్ర, ఎర్రబస్సు వంటి చిత్రాల రిజల్ట్‌ చూస్తే ఎవరైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అవి ప్రేక్షకులను బాగా భయపెట్టాయి. కానీ పవన్‌ పట్టుబడితే మాత్రం ఈ చిత్రానికి దాసరే దర్శకత్వం వహించడం ఖాయం అంటున్నారు. అందుకే పవన్‌ అనుకున్నంత పనిచేస్తాడేమో అని ఆయన ఫ్యాన్స్‌ టెన్షన్‌తో బెంగపెట్టుకుంటున్నారు..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ