అక్కినేని అఖిల్ హీరోగా వినాయక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అఖిల్. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తారని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే సినిమా గ్రాఫిక్స్ విషయంలో నిరాశ చెందిన నాగార్జున మరలా రీషూట్ చేయమని చెప్పడంతో ఈ సినిమా దసరా బరి నుండి తప్పుకుంది. మరీ.. లేట్ చేయకుండా తొందరగానే సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పిన నాగ్ మాటలు నిజమని తెలుస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 11న అఖిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నవంబర్ మొదటి వారంలో బెంగాల్ టైగర్, శంకరాభరణం వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. దీపావళి రోజున పోటీగా మరే సినిమా విడుదల కావట్లేదు. సో.. అఖిల్ కు దీపావళి కలిసోస్తుందేమో.. చూడాలి..!