ఆమధ్య మెగాహీరోలు గోపాల గోపాల, గోవిందుడు అందరివాడేలే, ముకుంద వంటి టైటిల్స్‌తో ఆ గోపాలుడిని పలకరించే టైటిల్స్‌ను పెట్టుకున్నారు. తాజాగా ఈ మెగాహీరోలు త్వరలో ఖాకీడ్రస్‌పై మోజుపడి అందరూ అవే డ్రస్‌లు వేస్తున్నారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సర్దార్‌గబ్బర్‌సింగ్ లో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రస్‌తోనే ఆయన ఎక్కడ చూసినా ప్రత్యక్షం అవుతున్నాడు. కాగా తమిళంలో ఘనవిజయం దిశగా సాగుతోన్న తని ఒరువన్ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో హీరోది పోలీస్ అధికారి పాత్ర కావడం గమనార్హం. గతంలో ఆయన పోలీస్‌గా చేసిన తుఫాన్ (జంజీర్)డిజాస్టర్ అయినప్పటికీ పోలీస్‌గా రామ్‌చరణ్ మరోసారి తనను తాను పరీక్షించుకోనున్నాడు. మరోపక్క బన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా సరైనోడు లో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల పవన్‌తో ఫొటోలకు ఫోజులిచ్చిన సాయిధరమ్‌తేజ్ కూడా పోలీస్ డ్రస్‌లో కనిపించనున్నాడు. మొత్తానికి మెగాహీరోలలో ఎక్కువ మంది పోలీస్ పాత్రలు చేస్తుండటంతో ఇప్పుడు అభిమానులు ఆయా చిత్రాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.