Advertisementt

బాబాయ్ కోసం నాన్నని వదులుతున్న ఎన్టీయార్

Sat 24th Oct 2015 06:53 AM
junior ntr,nannaku prematho release postpone,balakrishna dictator  బాబాయ్ కోసం నాన్నని వదులుతున్న ఎన్టీయార్
బాబాయ్ కోసం నాన్నని వదులుతున్న ఎన్టీయార్
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీయార్ హీరోగా ఎంత ఎదిగినా బాబాయ్ బాలకృష్ణ ఉన్నన్ని రోజులు అతని గొడుగు కిందే ఉండాలన్న విషయం నందమూరి అభిమానులు అందరూ ఒప్పుకున్నదే. కానీ తెలుగు దేశం పార్టీ అంతర్గత రాజకీయాలతో తారక్ మొత్తంగా బాబాయితో సత్సంబంధాలని వదులుకున్నాడు. ఒకప్పుడు ఎన్నికల కోసం  యంగ్ టైగర్ ఉత్సాహాన్ని ఎలా వాడుకోవాలా అని ప్రణాలికలు సిద్ధం చేసిన చంద్రబాబు నాయుడు కూడా బుడ్డోడిని పక్కన పెట్టడంతో కొడుకు నారా లోకేష్ భవిత్యవ్యానికి పోటీ లేకుండా జాగ్రత్త పడ్డాడు.

కెరీర్ పరంగా కూడా జూనియరుకి ఈ మధ్య ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటువంటి సమయంలో వస్తున్నఎన్టీయార్ నాన్నకు ప్రేమతో చిత్రం సంక్రాంతి బరిలో బాబాయి బాలయ్య డిక్టేటర్ పోటీగా నిలపడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. అందుకే అంతర్గతంగా అయిన వారితో చర్చించి, దర్శకుడు సుకుమార్ సహాయంతో, బాబాయి మీద ప్రేమతో నాన్నకు ప్రేమతో విడుదల తేదీని పొడిగించే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఈ విషయంతో అయినా బాబాయ్, అబ్బాయ్ మధ్య సయోధ్య కుదిరితే మంచిదేగా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ