Advertisementt

ఈ కుర్రహీరో తప్పు చేస్తున్నాడా?

Sat 24th Oct 2015 10:53 AM
raj tarun,uyyala jampala,cinema choopistha mava,raj tarun in varma direction,silent,raj tarun in silent movie  ఈ కుర్రహీరో తప్పు చేస్తున్నాడా?
ఈ కుర్రహీరో తప్పు చేస్తున్నాడా?
Advertisement
Ads by CJ

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ చిత్రాలతో వరుసగా రెండు హిట్లు కొట్టి హీరోగా బిజీ అయిన కుర్రహీరో రాజ్‌తరుణ్‌. రాజ్‌తరుణ్‌ మోములో ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా పలుకుతున్నాయని, అందువల్ల అతనికి మంచి భవిష్యత్తు ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందుకు తగ్గట్లే ఆయనకు మంచి మంచి ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఇక దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో రాజ్‌తరుణ్‌ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్‌హాసన్‌-సింగీతం శ్రీనివాసరావుల కాంబినేషన్‌లో ఎప్పుడో వచ్చిన పుష్పకవిమానం వంటి మూకీ చిత్రం తరహాలో ఈ చిత్రాన్ని కూడా మూకీ మూవీగా తెరకెక్కించాలని వర్మ ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రయోగాలు చేయడంలో వర్మ దిట్ట అనే చెప్పవచ్చు. కానీ ఆ ప్రయోగాలను చూడలేక ప్రేక్షకులు చచ్చిపోతారు. మరి తెలిసి తెలిసి మంచి భవిష్యత్తు ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న రాజ్‌తరుణ్‌ వర్మ మోజులో పడి కెరీర్‌ నాశనం చేసుకుంటున్నాడని అంటున్నారు. మూకీ చిత్రం కాబట్టి దేశంలోని ఏ భాషలోనైనా ఈ చిత్రాన్ని విడుదల చేసే సౌకర్యం ఉంటుందని, అది ఆర్ధికంగా ఎంతో లాభదాయమైన విషయమే అయినప్పటికీ సినిమా కంటెంట్‌ను పెద్దగా పట్టించుకోకుండా చిత్రాలు తీస్తున్న వర్మ దర్శకత్వంలో అంటే కాస్త జాగ్రత్తగానే ఉండాలని సన్నిహితులు రాజ్‌తరుణ్‌కు సలహాలు ఇస్తున్నారట.  ఈ చిత్రానికి సైలెంట్‌ అనే టైటిల్‌ను పెట్టనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ