పిల్ల జమిందార్‌తో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అశోక్ ఆ సినిమా తర్వాత ఆది కాంబినేషన్‌లో చేసిన సుకుమారుడు ఫ్లాప్ అయింది. అతని డైరెక్షన్‌లో తాజాగా వస్తున్న చిత్రం చిత్రాంగద. అంజలి ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తెస్తుందని అశోక్ నమ్ముతున్నాడు. అలాగే అంజలి కూడా ఇలాంటి సినిమా చేయడం తన అదృష్టమని చెప్తోంది.
హీరోలతో సినిమాలు చేస్తే లాభం లేదనుకున్నాడో ఏమోగాని ఇప్పుడు అశోక్ దృష్టంతా హీరోయిన్ల మీదే వున్నట్టు కనిపిస్తోంది. అంజలితో చిత్రాంగద చేస్తున్న అశోక్ ఈ సినిమా తర్వాత అనుష్క హీరోయిన్‌గా ఓ భారీ చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. ఇది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీనే. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యు.వి. క్రియేషన్స్ వంటి పెద్ద సంస్థలో అనుష్క వంటి టాప్ హీరోయిన్‌తో అశోక్ సినిమా చెయ్యబోతున్నాడంటే డైరెక్టర్‌గా అతని రేంజ్ బాగా పెరిగిందనే చెప్పాలి. అనుష్కతో చేయబోతున్న సినిమాకి భాగ్‌మతి అనే టైటిల్‌ని కూడా కన్‌ఫర్మ్ చేశారు. డిసెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.