Advertisementt

రజనీలోని డాన్‌ నిద్రలేస్తున్నాడు..!

Mon 26th Oct 2015 07:23 AM
rajinikanth,kabali movie,malaysia shooting,shankar,robo2  రజనీలోని డాన్‌ నిద్రలేస్తున్నాడు..!
రజనీలోని డాన్‌ నిద్రలేస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

65ఏళ్ల వయసులో సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 25ఏళ్ల కుర్రాడిలా మారిపోయాడు. ఆయన ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ రంజిత్‌తో కబాలి చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 17న వినాయక చవితి ప్రారంభమైన ఈ చిత్రాన్ని ఏళ్లకు ఏళ్లు కాకుండా కేవలం మూడునెలల్లో పూర్తిచేసేందుకు రంజిత్‌ పక్కాప్లాన్‌తో ఉన్నాడు. దానికి రజనీ సహకారం తోడవ్వడంతో ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం డిసెంబర్‌ నాటికి పూర్తికావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి షెడ్యూల్‌ చెన్నైలో జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. అక్కడే 25రోజుల పాటు షూటింగ్‌ జరుగనుంది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌కు ముందే రజనీతో సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల చేత రిహార్సల్స్‌ చేయించి, ప్రాక్టీస్‌ సెక్షన్‌ చేయించడంతోనే రంజిత్‌ ఇంత స్పీడ్‌గా షూటింగ్‌ పూర్తి చేస్తున్నాడని తెలుస్తోంది. ఇలా రజనీలోని డాన్‌ను రంజిత్‌ నిద్రలేపాడు. సో... ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి శంకర్‌ రోబో2 కోసం రజనీ స్పీడ్‌గా తన పని కానిచ్చేస్తున్నాడు. దాంతో కబాలి ని తమిళుల నూతన సంవత్సరమైన ఏప్రిల్‌14న విడుదల చేయాలని ముందు భావించారు. కానీ షూటింగ్‌ జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ చిత్రం ఇంకా తొందరగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ