Advertisementt

పవన్‌, నాగ్‌లు సంక్రాంతికి వస్తారా...?

Mon 26th Oct 2015 09:51 AM
nagarjuna,pawan kalyan,sardhar gabbar singh,nannaku prematho  పవన్‌, నాగ్‌లు సంక్రాంతికి వస్తారా...?
పవన్‌, నాగ్‌లు సంక్రాంతికి వస్తారా...?
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు కేవలం జూనియర్‌ ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్‌ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలకు ముందుగానే కర్చీఫ్‌లు వేసేశారు. అయితే పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రాన్ని మొదట్లో సంక్రాంతికే ప్లాన్‌ చేశారు. కానీ షూటింగ్‌ లేటవ్వడంతో ఇక అందరూ పవన్‌ వచ్చే ఏడాది వేసవికి వస్తాడని భావించారు. కానీ ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ బాగా వేగం పుంజుకొంది. ఇటీవల పవన్‌ కూడా తమ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా తెస్తామని అన్నాడు. దీంతో సర్దార్‌గబ్బర్‌సింగ్‌ సంక్రాంతికి వస్తుందా? లేక రాదా? అనే అనుమానం మొదలయింది. పవన్‌ సినిమా అంటే ఏ విషయాన్ని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. ఇక క్రిస్మస్‌ కానుకగా నాగార్జున సోగ్గాడే చిన్నినాయన చిత్రం విడుదలకు ప్లాన్‌ చేశారు. కానీ నాగచైతన్య -గౌతమ్‌మీనన్‌ల సాహసం శ్వాసగా సాగిపో చిత్రం డిసెంబర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తుండటంతో నాగార్జున కూడా తన సోగ్గాడే చిన్నినాయన చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. మరి చివరకు ఏయే చిత్రాలు సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద తలపడునున్నాయో మరో కొన్ని రోజుల్లో తేలిపోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ