Advertisementt

అంజలి.. దిస్ ఈజ్ టు మచ్!

Tue 27th Oct 2015 05:40 AM
anjali,chitrangadha,chitrangada movie,actress anjali irritation,chitrangada press meet  అంజలి..  దిస్ ఈజ్ టు మచ్!
అంజలి.. దిస్ ఈజ్ టు మచ్!
Advertisement
Ads by CJ

అటు తెలుగు, ఇటు తమిళనాట వివాదస్పద నాయికగా పేరుతెచ్చుకున్న అంజలి.. ఇప్పుడు సోలోగానే వుంటుంది. అంతేకాదు తన మకాంను కూడా చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కు మార్చింది. బంధువులతో గతంలో జరిగిన గొడవ కారణంగా ఇప్పుడు తన కెరీర్‌ని ఒంటరిగానే చక్కబెట్టుకుంటుంది ఈ అమ్మడు. సాధారణంగా హీరోయిన్ అనగానే వారి వెంట తల్లి లేక తండ్రి షూటింగ్ స్పాట్‌లో గార్డియన్‌గా వుంటూ.. ఆమె డేట్స్.. షూటింగ్ విషయంలో..ఇలా అన్నింట్లో కేర్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు అంజలి సోలోగానే వుండటం వల్ల షూటింగ్‌లకు లేట్‌గా హాజరవ్వడంతో పాటు..సలహాలు ఇచ్చేవారు లేకపోవడంతో.పతి విషయానికి అందరిపై చిరుబుర్రులాడుతుందట. ఇటీవల జరిగిన చిత్రాంగద ప్రెస్‌మీట్‌కు ఆమె దాదాపు గంటన్నర ఆలస్యంగా రావడంతో మీడియా వారికి ఓపిక నశించింది. అయితే  ఈ విషయంపై ప్రెస్‌మీట్‌లో ఈ సుందరాంగి కనీసం సారీ కూడా చెప్పకపోవడంతో మీడియా అంతా అంజలిపై కాస్త కోపంగానే వున్నారు. అయితే ఇందులో ఆమె తన తప్పేం లేదని చెప్పడం కొసమెరుపు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ