Advertisementt

వేదిస్తున్నాడంటూ..శ్రీను వైట్ల పై భార్య కేసు!

Tue 27th Oct 2015 08:13 AM
srinu vytla,director srinu vytle,roopa vytla,harassment case on srinu vytla,bruce lee  వేదిస్తున్నాడంటూ..శ్రీను వైట్ల పై భార్య కేసు!
వేదిస్తున్నాడంటూ..శ్రీను వైట్ల పై భార్య కేసు!
Advertisement
Ads by CJ

కామెడీతో చిత్రాలను బంపర్‌ హిట్‌ స్థాయికి తీసుకు వెళ్ళగల దర్శకుడు శ్రీనువైట్లకు..గత కొంత కాలంగా కాలం కలిసి రావడం లేదనే చెప్పాలి. దూకుడు తర్వాత సరైన హిట్‌లేని ఈ దర్శకుడు తాజాగా రామ్‌చరణ్‌తో చేసిన బ్రూస్‌లీ కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో బాగా డిస్టర్బ్‌ అయిన శ్రీనువైట్ల..ఆ ఒత్తిడి తట్టుకోలేక తన భార్యపై వేధింపుకు దిగినట్లు తెలుస్తుంది. శ్రీనువైట్ల వేధింపును తట్టుకోలేక తన భార్య రూప..కేసు పెట్టే స్థాయికి వెళ్ళిందంటే..శ్రీను టార్చర్‌ ఏ రేంజ్‌లో ఉందో ఊహించవచ్చు. అక్టోబర్‌ 15న పుట్టింట్లో ఉన్న రూపా వైట్లపై శ్రీను వైట్ల తీవ్రమైన వేధింపుకు దిగడంతో..చేసేదిలేక రూప బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త వేధిస్తున్నాడంటూ కేసు ఫైల్‌ చేయించింది. మళ్ళీ మరుసటి రోజు కేసును విత్‌డ్రా చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎప్పుడూ..ఎంతో మెచ్యూర్డ్‌గా వ్యవహరించే శ్రీనువైట్ల ఇలా మెంటల్‌ బ్యాలెన్స్‌ ఎందుకు తప్పినట్లో..అనేది తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా శ్రీనువైట్లపై ఇప్పుడు విపరీతమైన ఒత్తిడి ఉన్నదన్నది మాత్రం నిజం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ