Advertisementt

తమన్నాకి అది చేయడం అవసరమా?

Wed 28th Oct 2015 03:05 AM
heroine tamanna,bahubali heroine tamanna,tamanna in item song,tamanna item song in bellamkonda srinivas movie  తమన్నాకి అది చేయడం అవసరమా?
తమన్నాకి అది చేయడం అవసరమా?
Advertisement
Ads by CJ

సౌత్‌లో మంచు మనోజ్‌ హీరోగా నటించిన శ్రీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన తమన్నా ఆ సినిమా తర్వాత హ్యాపీడేస్‌, కాళిదాసు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాల్లో కొంత కొంత గ్యాప్‌తో నటించింది. మధ్యలో కొన్ని తమిళ్‌ సినిమాలు కూడా చేసింది. తెలుగులో లాభం లేదనుకుందో ఏమో తన మకాం చెన్నై మార్చేసింది. తెలుగు సినిమాలు చేయడం మానేసి వరసగా ఓ పది తమిళ్‌ సినిమాల్లో నటించి అక్కడ టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. అప్పుడు మన దర్శకనిర్మాతలు ఆమెను మళ్ళీ టాలీవుడ్‌కి తీసుకొచ్చారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసిన తమన్నాకి ఈమధ్య వచ్చిన బాహుబలి మంచి పేరు తెచ్చింది. దీంతో ఒక్కసారిగా తన రెమ్యునరేషన్‌ కూడా పెంచేసింది. 

ఇక్కడ విషయం ఏమిటంటే హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌కి వెళ్ళిన తమన్నా ఇప్పుడు ఓ ఐటమ్‌ సాంగ్‌ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో తమన్నా ఐటమ్‌ సాంగ్‌ చెయ్యడానికి ఓకే చెప్పింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ మొదటి సినిమా అల్లుడు శీనులో కూడా ఓ సాంగ్‌ చేసిన ఆమె మళ్ళీ అతని సినిమాలోనే ఐటమ్‌ సాంగ్‌ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కోటి రూపాయలు తీసుకొని అల్లుడు శీనులో సాంగ్‌ చేసిన తమన్నా మరి ఈ సినిమాకి ఎంత ఛార్జ్‌ చేసిందో! సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదుగుతున్న ఈ మిల్కీ బ్యూటీకి ఇలాంటి ఐటమ్‌ సాంగ్స్‌ చెయ్యడం అవసరమా అని ఇండస్ట్రీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ