Advertisementt

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ!

Wed 28th Oct 2015 08:30 AM
parineeti chopra,ntr,koratala siva,maithri movie makers  ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ!
ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వం వహించబోయే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ పక్కన జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ పరినీతి చోప్రా నటించనుందనే మాటలు వినిపిస్తున్నాయి. పరినీతి ని తెలుగు చిత్రాల్లో నటించమని ఇంతకముందే చాలా మంది దర్శకులు సంప్రదించారు. కాని డేట్స్ అడ్జస్ట్ చేయలేక వచ్చిన అవకాశాలన్నీ వదులుకుందీ ఈ భామ. ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి పరినీతి ఓకే చేస్తే కనుక తనకు తెలుగులో ఇదే మొదటి చిత్రమవుతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ