Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-కళ్యాణ్ రామ్

Thu 29th Oct 2015 01:28 PM
kalyan ram interview,sher movie,mallikharjun,ntr  సినీజోష్ ఇంటర్వ్యూ-కళ్యాణ్ రామ్
సినీజోష్ ఇంటర్వ్యూ-కళ్యాణ్ రామ్
Advertisement
Ads by CJ

పటాస్ చిత్రంతో విజయ పధంలో దూసుకుపోతున్న హీరో కళ్యాణ్ రామ్ తాజాగా షేర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు మల్లిఖార్జున్ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

షేర్ సినిమా ఎలా ఉండబోతోంది..?

ఇదొక రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. నా గత సినిమాల్లో ఉండే ట్విస్టులు, భారీ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండవు. ఇందులో ఓ సివిల్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. తన తండ్రికి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో సహాయం చేస్తుంటాడు. మైండ్ లో ఒకటి పెట్టుకొని బయట మరొకటి చేసే క్యారెక్టర్ తనది. సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఉంటే మంచిదే.. కాని ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఓ సాధారణ సినిమా చూడడానికి వెళ్తున్నామని చూస్తే ఆడియన్స్ ఖచ్చితంగా అలరిస్తుంది.

పటాస్ సినిమా తరువాత స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేసారా..?

షేర్ సినిమా పటాస్ కు ముందుగానే ఓకే చేసిన సబ్జెక్టు. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. పటాస్ సినిమా రిలీజ్ అయిన తరువాత షేర్ సినిమా స్క్రిప్ట్ లో ఎంటర్టైన్మెంట్ కాస్త పెంచాం. నాకు బ్రహ్మానందం గారి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ శాతం ఉంటుంది. 

మల్లిఖార్జున్ గారితో వరుసగా సినిమాలు చేయడానికి కారణం..?

మల్లితో అభిమన్యు, కత్తి లాంటి సినిమాలు చేసాను. నా కెరీర్ ప్రారంభం నుండి ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. నేను ఏ దర్శకుడైనా.. స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు తనలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో.. చూస్తాను. కొత్త దర్శకులకు కూడా వారి నమ్మకాన్ని చూసే అవకాసాలిస్తాను. మల్లి లో చాలా టాలెంట్ ఉంది. ఈ సినిమా చాలా బాగా డైరెక్ట్ చేసాడు. టీం అందరిలో ఎక్కువ కష్టపడింది తనే. ప్రతిది దగ్గరుండి చూసుకున్నాడు. చాలా ఎఫర్ట్ పెట్టి చేసాడు. షేర్ తో మల్లిఖార్జున్ కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.

సక్సెస్, ఫెయిల్యూర్ ను ఎలా ట్రీట్ చేస్తారు..?

నా దృష్టిలో సక్సెస్, ఫెయిల్యూర్ కు మధ్య డిఫరెన్స్ పోయింది. విజయం వచ్చినప్పుడు తక్కువ ఆలోచిస్తాను. ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ తప్పు చేసామా.. అని ఎక్కువగా ఆలోచిస్తాను. తరువాత అలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాను.

ఓం తరువాత ప్రయోగాత్మక చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నారా..?

అలా ఏం లేదు. నాకు విభిన్న చిత్రాలు చేయడమంటేనే ఇష్టం. ఓం సినిమా మూడు సంవత్సరాలు నా లైఫ్ పెట్టి చేసాను. 3డి టెక్నాలజీ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. కాని మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ ఎక్కువ ఉండడం వలనే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అందుకే ఇక ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. స్క్రీన్ ప్లే, నేరేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని చేస్తాను.

షేర్ ఆడియో వేడుకలో చాలా ఎమోషనల్ అయినట్లున్నారు..?

నాకు ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలంటే ఇష్టం. సినిమాల్లో నా పాత్ర గురించి ఎవరు మాట్లాడినా పర్లేదు కాని నా నిజ జీవితం గురించి మాట్లాడితే నచ్చదు. కుటుంబం పట్ల చాలా జాగ్రత్త తీసుకొని ఉంటాను. ఎవరైనా నన్ను పాయింట్ అవుట్ చేసి చూపిస్తే అసలు నచ్చదు. చాలా ఎమోషనల్ అయిపోతాను. మిగతా విషయాలు అసలు పట్టించుకోను.

మొదట ఓకే చేసిన హీరోయిన్ ను మార్చడానికి కారణం..?

తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఎవరు త్రుప్తి పడలేదు. రీషూట్ చేసింది కూడా 10 రోజులు మాత్రమే.. తనతో పాటలు కూడా షూట్ చేయలేదు. కేవలం టాకీ పార్ట్ మాత్రమే చేసాం.

ఎన్టీఆర్ రషెస్ చూసి ఏం అన్నారు..?

నా ప్రతి సినిమా రషెస్ చూస్తాడు. పటాస్ చూసాడు అలానే ఈ సినిమా కూడా చూసాడు. మేమిద్దరం కలిసి ఏం మాట్లాడుకున్నా.. అది మా మధ్యనే ఉంటుంది.

ఎన్టీఆర్ హీరోగా మీ బ్యానర్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది..?

ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఆ విషయంలో త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాను.

తదుపరి చిత్రాలు..?

సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనుంది. ప్రాజెక్ట్స్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారికంగా తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ