Advertisementt

లోఫర్ విశేషాలు!

Thu 29th Oct 2015 03:36 PM
varun tej,loafer movie,december 18th release,poori jagannath  లోఫర్ విశేషాలు!
లోఫర్ విశేషాలు!
Advertisement
Ads by CJ

ఇటీవల వచ్చిన కంచె చిత్రంలో తన నటనతో రెండో చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు పొందిన మెగాహీరో వరుణ్‌తేజ్‌. కంచె చిత్రాన్ని అన్నివైపుల నుండి మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో వరుణ్‌తేజ్‌ తాజా చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఆయన పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు లోఫర్‌ అనే పేరుతో ప్రచారం జరిగిన ఈ చిత్రానికి మా అమ్మ మహాలక్ష్మీ అనే టైటిల్‌ను అనుకొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సి.కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తూ, ఆ తేదీని లాక్‌ చేశారని సమాచారం. నవంబర్‌ చివరి వారంలో గానీ లేదా డిసెంబర్‌ మొదటి వారంలో గానీ ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. మరి ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ మదర్‌ సెంటిమెంట్‌ను అద్భుతంగా పోషించినట్లు సమాచారం. ఇందులో వరుణ్‌తేజ్‌కు అమ్మగా రేవతి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ