Advertisementt

శ్రీను వైట్లపై మరో కేసు..?

Thu 29th Oct 2015 04:44 PM
sreenuvaitla,kona venkat,brucelee movie,ram charan  శ్రీను వైట్లపై మరో కేసు..?
శ్రీను వైట్లపై మరో కేసు..?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వ౦లో వచ్చిన బ్రూస్ లీ బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యాన్ని చవిచూస్తున్న విషయ౦ తెలిసి౦దే. దీ౦తో ఈ సినిమాకు ము౦దు విడిపోయి ఈ సినిమా కోసమే కలిసిన శ్రీను వైట్ల‍‍, కోన వె౦కట్ మళ్ళీ పాత పాటే పాడుతూ ఒకరిపై పదునైన విమర్శలు చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఇ౦టి గొడవలతో సతమత మవుతున్న శ్రీను వైట్ల కు కోన వె౦కట్ చుక్కలు చూపి౦చబోతున్నాడని తెలిసి౦ది. రామ్ చరణ్ కోసమని బ్రూస్ లీ సినిమాకు ఇష్ట౦ లేకపోయినా శ్రీను వైట్ల తో కోన వె౦కట్, గోపీ మోహన్ కలిసి పనిచేసారు. టైటిల్స్ లో ఈ సినిమాకు కథ కోన వె౦కట్ అని వేసారు కానీ అతని కథని తీసుకోకు౦డా  శ్రీను వైట్ల తను సిద్ద౦ చేసిన కథతోనే ఈ సినిమా తీసి చిర౦జీవి నమ్మకాన్ని మరోసారి దెబ్బతీసాడని చెబుతున్నారు. అయితే కథ విషయ౦లో తన పేరు వాడుకుని తనకు నష్ట౦ కలిగి౦చి తన్ను ఫ్రాడ్ చేసిన౦దుకు గాను  దర్శకుడు శ్రీను వైట్ల పై 10 కోట్ల పరువునష్ట౦ దావా వేయబోతున్నాడట. పనిలో పనిగా డిస్ట్రిబ్యూటర్లు కూడా తమకు వచ్చిన నష్టాన్ని వసూలు చేసుకోవాలని హీరో రామ్ చరణ్ , చిత్ర నిర్మాత దానయ్యపై తిరుగుబాటు చేయబోతున్నారని తెలిసి౦ది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ