ప్రముఖ రచయిత కోనవెంకట్ తన పరిచయాలను, స్నేహాలను బాగా వాడుకొని తన సినిమాకు మంచి క్రేజ్ క్రియేట్ చేయడంలో దిట్ట. గీతాంజలి చిత్రం సమయంలోనే ఆ విషయం ప్రూవ్ అయింది. తాజాగా ఆయన నిర్మాతగా మరో నిర్మాత ఎమ్.వి.వి.సత్యనారాయణతో కలిసి సంయుక్తంగా నిఖిల్, నందిత, అంజలి ముఖ్యపాత్రల్లో ఆయన నిర్మిస్తున్న చిత్రం శంకరాభరణం. ఈ చిత్రం కోసం ఇప్పటికే ఆయన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో పాటు రానాను కూడా బాగానే వాడుకొన్నాడు. ఈ చిత్రం విడుదల సమయానికి ఆయన మరెవ్వరిని ఎలా వాడుకుంటాడో వేచిచూడాలి...! మొత్తానికి మంచి నిర్మాతగా ఆయన తనను తాను నిరూపించుకొంటున్నాడు. కేవలం ఏడు కోట్లతో తెరకెక్కిన శంకరాభరణం చిత్రానికి థియేటర్ హక్కులే దాదాపు 8కోట్లకు పైగా అమ్మినట్లు సమాచారం. ఇక శాటిలైట్ హక్కులను మూడుకోట్లకు అమ్మారు. సో.. సినిమా విడుదలకు ముందే కోనతో పాటు ఎమ్.వి.వి.సత్యనారాయణకు తలా రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇక సినిమా ఓ వారం పాటు బాగా ఆడితే మరిన్ని లాభాలను రుచిచూడవచ్చు. బయ్యర్లకు కూడా ఇది సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.