దసరా సీజన్‌ని క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా బరిలో దిగిన చిత్రం బ్రూస్‌లీ. కానీ థియేటర్లలో జనాలు లేక వెలవెలబోతోంది. తొలివారం కూడా అటు చరణ్‌ని, ఇటు పరిశ్రమ వర్గాలను ఈ చిత్రం కలెక్షన్లు నివ్వెరపరిచాయి. చిరంజీవి కోసమైనా జనాలు వస్తారనుకుంటే చిరు స్టామినా కూడా బ్రూస్‌లీ ని కాపాడలేకపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన బయ్యర్లు 40శాతం నష్టాలు భరించాల్సివస్తుందని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేటర్ల అద్దెలు కట్టుకోవడానికి కూడా వచ్చిన వసూళ్లు సరిపోవడం లేదు. రామ్‌చరణ్ తన పారితోషికంలో కొంత వెనక్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని వార్తలు షికారు చేశాయి. అయితే రామ్‌చరణ్ మాత్రం తన పారితోషికంలో పైసా కూడా వెనక్కి ఇచ్చే ఉద్దేశ్యంలో లేడు. దాంతో బయ్యర్లు విలవిలలాడుతున్నారు.