ఒకప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల అంటే హిట్ గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. ఆయనతో సినిమాలు తీస్తే లాభాలు గ్యారంటీ అని నిర్మాతలు, ఆయన సినిమాలో నటిస్తే బావుండు అని కోరుకునే హీరోహీరోయిన్లు అనేక మంది ఉండేవారు. కానీ ఆగడు, బ్రూస్‌లీ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలవడం, మరోవైపు కోన, గోపీమోహన్ వంటి వారితో విభేదాలు, భార్యతో ఏర్పడిన స్పర్ధలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వంటి కష్టాల మీద కష్టాలు ఎందుకు వస్తున్నాయా? అనే అనుమానం అందరిలోనూ మరీ ముఖ్యంగా శ్రీనువైట్లకు వస్తోంది. వీటన్నిటికి కారణం ఆయన కొత్తగా కట్టుకున్న ఓ బంగళా వల్లే అని, ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుండి శ్రీనువైట్లకు అసలు కలిసి రావడం లేదని వాస్తు నిపుణులు చెప్పినట్లు సమాచారం. తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంట్లోకి చేరిన తర్వాతే ఇలాంటి గొడవలు ఎక్కువగా వస్తున్నాయని, తనకు అసలు కాలం కలసిరావడం లేదనే నిర్ణయానికి శ్రీనువైట్ల సైతం వచ్చాడు. అయితే ఆ ఇంటికి అమ్మేద్దామంటే శ్రీను కష్టాలు తెలిసిన ఎవ్వరూ ఆ ఇంటిని కొనేందుకు ముందుకు రావడం లేదట...!