Advertisementt

చిరంజీవి మెగాస్టారేనా...?

Fri 30th Oct 2015 07:29 PM
chiranjeevi,vishwanath,swayamkrushi,apadhbaandhuvudu  చిరంజీవి మెగాస్టారేనా...?
చిరంజీవి మెగాస్టారేనా...?
Advertisement
Ads by CJ

చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో ఉన్నంత కాలం మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలిగాడు. సినిమాలకు టాటా చెప్పి రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు ఏడేనిమిదేళ్లు అవుతోంది. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత ఆయన హీరోగా మరో చిత్రం చేయలేదు. ఇక రాజకీయాల్లోకి వెళ్లి కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయనకు పొలిటికల్‌ ఎంట్రీ తర్వాత మాత్రం ఎన్నో అవమానాలు జరిగాయని చెప్పవచ్చు. ఇలా అవమానాలను ఆయన మూటగట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉండే పరిస్థితులు లేకపోవడంతో మరోసారి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి, 150వ చిత్రం చేయడానికి నడుంబిగించాడు. ఒకప్పుడు తెలుగు తెరపై హీరోగా వెలుగొందినప్పుడు ఆయన్ను మెగాస్టార్‌గా పిలవడం సబబే కానీ... సినిమాలకు దూరమై రీఎంట్రీ ఇస్తున్న ఆయన్ను మెగాస్టార్‌గా పరిగణించడం సబబు కాదనేది కొందరి వాదన. ఇలాంటి వాదనలతో ఏకీభవిస్తూ కళాతపస్వి తాజాగా కొన్ని కామెంట్స్‌ చేశారు. చిరంజీవితో స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలను తెరకెక్కించిన కె.విశ్వనాథ్‌ ఇటీవల ఓ సందర్బంలో మాట్లాడుతూ... చిరు ఇక మెగాస్టార్‌ కాదు. పాలిటక్స్‌లోకి ఎంటర్‌ అవ్వడం ద్వారా ఆయన తనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌లో చాలా వరకు కోల్పోయారు. మాస్‌ సినిమాల్లో యాక్ట్‌ చేయడం ద్వారా ఆయన మళ్లీ మునుపటి క్రేజ్‌ తెచ్చుకోవడం కష్టం. ఇకపై నటించబోయే సినిమాను తన మొదటి సినిమా అని భావించి ఆయన మళ్లీ మెగాస్టార్‌ రేంజ్‌కు ఎదగాలి.. అంటూ చిరుకు సూచించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని విశ్వనాథ్‌ స్పష్టం చేశాడు.