Advertisementt

చరణ్ సినిమాపై దాసరి కౌంటర్!

Sat 31st Oct 2015 01:18 PM
dasari narayana rao,tripura audio function,ram charan,bruce lee,dasari counter on bruce lee  చరణ్ సినిమాపై దాసరి కౌంటర్!
చరణ్ సినిమాపై దాసరి కౌంటర్!
Advertisement
Ads by CJ

గత కొంతకాలంగా సీనియర్ దర్శకుడు దాసరి, మెగా హీరోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్‌చరణ్, దాసరి మధ్య ఇటీవల పలుమార్లు మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. రుద్రమదేవి సినిమా విషయంలో కూడా బ్రూస్‌లీ సినిమాను వాయిదా వేసుకోమని  దాసరి పరోక్షంగా మెగాకుటుంబానికి సలహా ఇవ్వడం.. దానికి రామ్‌చరణ్ ఆ మాటలు వింటానికి బాగానే వుంటాయి.కానీ వాస్తవం మరోలా వుంటుందని కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ దసరా పోటీలో విడుదలై డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకున్న బ్రూస్‌లీ చిత్రంపై దాసరి మరోసారి పరోక్షంగా కౌంటర్ వేసి ఆ చిత్రాన్ని ఫ్లాప్‌గా తేల్చేశాడు. గురువారం రాత్రి జరిగిన త్రిపుర ఆడియో వేడుకలో దసరాకు విడుదలైన సినిమాల్లో కంచె, కొలంబస్, రాజుగారి గది సినిమాలు బాగా ఆడుతున్నాయని.. ఆ మూడు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అని చెప్పడంతో.. గురువు గారు మళ్లీ వేశారు కదా.. అంటూ గుసగుసలాడుకున్నారు సినీజనాలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ