గుణశేఖర్ తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరెక్కించిన రుద్రమదేవి పెట్టుబడి 70కోట్ల పైమాటే. విడుదలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు అక్టోబర్ 9న విడుదలైంది. బాహుబలి తర్వాత అనుష్క నటించిన చిత్రం కావడం, మరోవైపు గోనగన్నారెడ్డిగా అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రను అల్లుఅర్జున్ పోషించడంతో రుద్రమదేవి కి మంచి క్రేజ్ లభించింది. ఈ చిత్రం దసరా సీజన్‌లో కూడా కలెక్షన్లపరంగా ఓకే అనిపించింది. ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం 60కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో షేర్ 40కోట్లను మించలేదని ట్రేడ్‌వర్గాల టాక్. మరి గుణశేఖర్‌కు ప్రశంసల లభించినప్పటికీ ఆయన పెట్టిన 70కోట్ల పెట్టుబడి ఏమేరకు రికవరీ అవుతుందనేది చర్చనీయాంశం అయింది. దీంతో గుణశేఖర్‌కు బడ్జెట్ రికవరీ కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.