చిరంజీవి నూట యాభయ్యో సినిమాకు మొహం వాచిపోయి ఉన్న అభిమానులకు బ్రూస్ లీ ఓ చక్కటి తేనేటి విందులా ఉండాలని రామ్ చరణ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కొందరు అభిమానులు, మెగాస్టార్ ఇరగదీసాడని, అరగదీసాడని బ్రూస్ లీ ఆఖర్లో మెరిసిన మెరుపులకు మురిసిపోతే ఇంకొందరైతే ఈ మూడు నిమిషాల పోరాట సన్నివేశం సినిమాను ఎక్కడికో తీసుకుపోతుందని ఆశ పడ్డారు. అదేదో చిరు సినిమాలో అన్నట్టుగానే ప్రపంచం చివర అంచుల దాక తీసుకెళ్ళి, అక్కడి నుండి దూకేసింది.
మొత్తానికి బ్రూస్ లీ పంచు కేవలం హీరో రామ్ చరణ్ మీదే కాకుండా, క్లైమాక్స్ హీరో చిరంజీవి మీద కూడా పిడి గుద్దులా పడింది. విషయం ఏమిటంటే తమిళ హిట్ సినిమా కత్తి తెలుగు రీమేక్, చిరంజీవి నూట యాభయ్యవ చిత్రం అని బ్రూస్ లీకి ముందర అభిమానుల్లో ఏర్పడిన సంతోషకరమైన వాతావారణం ఇప్పుడు బ్రూస్ లీ తదనంతరం మెరుపులా మాయమయింది. జరిగిన ఇమేజి డ్యామేజీని లెక్కలేస్తున్న చిరంజీవి ఈ దసరాకి కానీ దీపావళికి కానీ అనౌన్స్ చేస్తానన్న తన సినిమా ఆలోచనలు అటకెక్కించేసినట్టే. వచ్చే ఏడాదికి గానీ మెగా స్టార్ మౌనం వీడకపోవచ్చు.