Advertisementt

అఖిల్, ఇక రికార్డుల జాతర

Tue 03rd Nov 2015 02:20 PM
akhil records,akhil collections,akhil box office  అఖిల్, ఇక రికార్డుల జాతర
అఖిల్, ఇక రికార్డుల జాతర
Advertisement
Ads by CJ

తెరంగేట్రం చేసిన ఏ మొదటి సినిమా హీరోకి రాని క్రేజ్ అఖిల్ సినిమాకు లభించింది. అక్కినేని వంశం నుండి రాబోతున్న మూడో తరం నటుడు కావడం, అందునా మాస్ హీరో కొరతను అనుభవించిన అక్కినేని అభిమానులకి అఖిల్ ఒకే ఒక్క ఆశగా అవతరించాడు. అందుకే తండ్రి నాగార్జున కూడా ఫ్యాన్స్ అభీష్టం మేరకు ఆచితూచి అడుగేసి యాక్షన్ లవింగ్ దర్శకుడు వీవీ వినాయక్ గారికి అఖిల్ సినిమా బాధ్యతలు అప్పగించి మనసులోని మాటను, ఆశను చెప్పకనే చెప్పుకున్నాడు. గత కొంత కాలంగా షూటింగ్ దశలో ఉన్న అఖిల్ చిత్రం, అన్ని అవరోధాలు దాటుకొని ఈ నెల పదకొండున విడుదలకు సిద్దమవడంతో  అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

యాక్షన్, డ్యాన్సుల్లో ప్రత్యేక శిక్షణ గావించిన అఖిల్ మొదటి సారే అద్భుతమైన నటనను కనబరిచాడని యూనిట్ మొత్తం ఘంటాపథంగా చెబుతుండడం ఫ్యాన్సుకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ముఖ్యంగా  ఇంట్రడక్షన్ సాంగులో అఖిల్ వేసిన స్టెప్పులో న భూతో న భవిష్యత్ అన్నట్టుగా సాగాయట. అలాగే పోరాటాల్లో ఎటువంటి డూపులను వినియోగించకుండా అఖిల్ చేసిన సాహసోపేతమైన విన్యాసాలు సినిమాను మరో స్థాయికి తీసుకెల్లబోతున్నాయట. ఇన్ని కమర్షియల్ హంగులు కలిసాయి కాబట్టే అఖిల్ చిత్రానికి ఎనలేని హైప్ క్రియేట్ అయింది. ఇక పదకొండు నుండి సినిమా హాల్లలో జాతర, రికార్డుల మోతరకు అక్కినేని ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాత నితిన్, సుధాకర్ రెడ్డిలు భారీ రిలీజుకు సమాయత్తమయ్యారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ