వైవిధ్య చిత్రాల దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభపటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రతాప్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ఈ ఆడియో వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. యూత్‌ను ఆకట్టుకునే వైవిధ్యమైన పాయింట్‌తో రూపొందిన ఈ చిత్ర కాన్సెప్ట్ దిల్‌రాజు బాగా ఆకట్టుకుందట. ఇంకేముంది డిస్ట్రిబ్యూటర్‌గా రంగంలోకి దిగి కుమారి 21ఎఫ్ నైజాం హక్కులను ఫ్యాన్సీ రేటుకు దిల్‌రాజు సొంతం చేసుకున్నాడని తెలిసింది. ఇటీవల దిల్‌రాజు నిర్మాతగా కంటే పంపిణీదారుడిగానే ఎక్కువ ప్రాఫిట్స్ పొందుతుండటం విశేషం.