నందమూరి హీరోల టైం అస్సలు బాగోలేదు. ఈ ఏడాది మొదట్లో దీన్ని నందమూరి నామ సంవత్సరంగా నామకరణం చేసిన జూనియర్ ఎన్టీయార్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నామానికి సార్థకత చేకూర్చలేకపోయాడు. అతడికి తోడు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కూడా సినిమాల విషయంలో అన్నింటా బోల్తా పడుతూనే వస్తున్నారు. షేర్, కిక్ 2ల పేరిట కళ్యాణ్ రామ్, లయన్ పేరిట బాలకృష్ణ అభిమానులను సంతృప్తి పరచలేకపోయారు. ఇక ఇయర్ ఎండ్ వచ్చేయడంతో రానున్న నెల రోజుల్లో వీరి కొత్త చిత్రాలు విడుదల అవుతాయి అనుకోవడం టూ మచ్ గ్రీడీ అవుతుంది. అందుకే కొత్త సంవత్సరం సంక్రాంతికి నందమూరి హీరోలు రికార్డులు చీల్చి చెండాడతారని కలలు కంటున్న ఫ్యాన్సుకు నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ చిత్రాల షూటింగ్ మరింత ఆలస్యం అవబోతుందని తెలిస్తే గుండె ఆగిపోతుందేమో. ఎన్టీయార్ స్పెయిన్ షెడ్యూలు ఇంకా ఖరారు కాకపోవడంతో నాన్నకు ప్రేమతో విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని ఓ వార్త. అలాగే బాలయ్య రాజకీయ కారణాల దృష్ట్యా డిక్టేటర్ షూటింగ్ కూడా నత్తనడకన సాగుతోంది, సో, ఇదీ పండగకి రావడం డౌట్ అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దొందూ దొందే అన్నట్టుగా ఉంది బాబాయి, అబ్బాయిల స్టేటస్.