సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తమిళ, తెలుగు బాషలతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక జపాన్, మలేషియా వంటి దేశాల్లో కూడా రజనీకి వీరాభిమానులు ఉన్నారని విన్నాం. కానీ దానిని ఇప్పుడు చూస్తున్నాం.తాను నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి' కోసం రజనీ మలేషియా వెళ్లాడు. అక్కడే రెండు నెలల పాటు షూటింగ్ జరుగనుంది. రజనీ తమ దేశానికి వచ్చాడని తెలుసుకున్న మలేషియాలోని రజనీ అభిమానులు రోజురోజుకు ఎక్కువగా వేలాది మంది వచ్చి ఆయన్ను కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. రజనీని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఇక రజనీకి అక్కడి ప్రభుత్వం కూడా రాజమర్యాదలు కల్పిస్తోంది. ఆయన విడిది చేసిన హోటల్‌లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇక మలేషియా గవర్నర్ కూడా వచ్చి రజనీని కలిసి ఆయనతో లంచ్ చేసి వెళ్లాడు. మొత్తానికి రజనీకి మలేషియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను చూసి ఇప్పుడు అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.