సౌత్‌లో ఓ సినిమాకు హిట్‌టాక్ వచ్చిందంటే వెంటనే బాలీవుడ్‌కి చెందిన మేకర్స్ దృష్టి వాటిపై పడుతోంది. వారు వాటి రైట్స్ తీసుకొని అక్కడ పెద్ద పెద్ద స్టార్స్‌లతో ముందుకు వెళుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఘవనిజయం సాధించిన సినిమాలు బాలీవుడ్‌లో ఘనవిజాయాలు సాధిస్తుండటంతో ఇలా రైట్స్‌కు డిమాండ్ వచ్చేస్తోంది. తాజాగా తెలుగులో హిట్టైన 'శ్రీమంతుడు', 'కంచె' చిత్రాలు అదే కోవలో హిందీలోకి రీమేక్ అవ్వనున్నాయని సమాచారం. ఇక శ్రీమంతుడు విషయానికి వస్తే ఈ చిత్రం రైట్స్‌ను తనదగ్గరే ఉంచుకొన్న దర్శకుడు కొరటాల శివతో పలువురు బాలీవుడ్ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ బేరసారాలు ఓ కొలిక్కి వచ్చే ఓ పెద్ద హీరోతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోగా నటించడానికి సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్, వరుణ్‌ధావన్‌లు పోటీ పడుతున్నారు. ఎట్టకేలకు ఆ అవకాశం సల్మాన్‌నే వరించే అవకాశం ఉందని బాలీవుడ్ కథనాల సారాంశం.